Monday, February 22, 2016

శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయ వార్షికోత్సవం

నవతెలంగాణ-కాజీపేట
 మడికొండలో సేవాభారతి జిల్లా శాఖ నిర్వహిస్తున్న శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ వార్షికోత్సవం ఆదివారం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 15 ఉచిత వసతి గృహాలు, సేవాభారతి ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థుల కోసం ఇటీవల మడికొండలోని వ్యాసపురిలో దాతల సహకారంతో శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం నిర్మాణం జరిగింది.ఈ విద్యాలయంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు వార్షికోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌ అధినేత వెలిగేటి రాజిరెడ్డి, ప్రధాన వక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యవాహ ఎక్కా చంద్రశేఖర్‌ హాజరై మాట్లాడారు. అత్మీయ అతిథులుగా సామాజిక కార్యకర్త మడత నారాయణదాసు, విద్యుత్‌ శాఖ రిటైర్డ్‌ సీఇ వెదిరె వెంకట్‌రెడ్డి, సేవా భారతి తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ జనార్ధన్‌, కార్యదర్శి రఘునాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ్‌ సంఘ ఛాలక్‌ పొల్సాని శ్రీనివాస్‌రెడ్డి, మహానగర సంఘ ఛాలక్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు. అనంతరం ఆవాస ప్రముఖ్‌ సత్యం విద్యార్థులతో శారీరక్‌, రంగ స్థల కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగ, నియుద, సాహసకృత్యాలు తదితర కార్యక్రమాలు ఆహూతులను ఆకర్షించాయి. కార్యక్రమంలో సేవా భారతి అధ్యక్షులు కాటం రామ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి మేరుగు హన్మారెడ్డి పాల్గొన్నారు.
Source: 
http://www.navatelangana.com/article/warangal/230342

No comments:

Post a Comment