Sunday, February 21, 2016

నిరక్షరాస్య కుటుంబాలకు సేవాభారతి అండ

నిరక్షరాస్య కుటుంబాలకు సేవాభారతి అండ
ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ కార్యావహ ఎక్కా చంద్రశేఖర్‌
మడికొండ, న్యూస్‌టుడే: విలువలతో కూడిన విద్యనందించి భారతావనికి మంచి పౌరులను అందించడమే సేవాభారతి ప్రధాన లక్ష్యమని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యావహ ఎక్కా చంద్రశేఖర్‌ అన్నారు. విద్యారణ్య ఆవాస విద్యాలయ వార్షికోత్సవాలను ఆదివారం రాత్రి మడికొండలోని నెహ్రూనగర్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ అధినేత వెలిగేటి రాజిరెడ్డి వేడుకలను ప్రారంభించారు. ఎక్కా చంద్రశేఖర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రతిభ కలిగిన నిరక్షరాస్య కుటుంబాలను గుర్తించి వారికి విద్య, ఆర్థిక, సామాజిక అంశాలు, భవిష్యత్తు భారతావని వంటి అంశాల్లో తర్ఫీదునిచ్చి వారి బంగారు భవిష్యత్తుకు సేవాభారతి బీజాలు వేస్తోందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బాలకార్మికుల నిర్మూలన, కోయపిల్లల దత్తత, వికాస కేంద్రాలు, ఏకలవ్య ఆశ్రమం, నిరాశ్రిత, మడికొండలో విద్యారణ్య ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామన్నారు. అనంతరం ఆవాస్‌ ప్రముఖ్‌ సత్యం విద్యార్థులతో శారీరక్‌ రంగస్థల కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగ, నియుద్ధ, సాహసకృత్యాలు, దండయుద్ధ, వ్యాయామ్‌ యోగ్‌, కోలాటం, నృత్యం, దశావతారాల నృత్య రూపకం, భగత్‌సింగ్‌ నాటిక, శివశివశంకర నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సేవాభారతి అధ్యక్షుడు డాక్టర్‌ కాటం రామ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి మేర్గు హన్మారెడ్డి, సంపత్‌రెడ్డి, లక్ష్మణ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
EEnaadu: Warangal
http://eenadu.net/district/inner.aspx?dsname=Warangal&info=wgl-zonal#1

No comments:

Post a Comment