Wednesday, February 15, 2017

యువతకు కేవలం సంపాదించడం మాత్రమే కాకుండా వాటితోపాటు వృత్తి నైపుణ్యం నేర్పడం కోసమే విద్యారణ్య ఆవాసం


ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర ప్రచారక్‌ ఎలె శ్యాం కుమార్‌ 
మడికొండ, న్యూస్‌టుడే: విశ్వంలోని సమస్త ప్రాణాల సంక్షేమాన్ని హిందూమతం ఆకాంక్షిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తర, దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ క్షేత్ర ప్రచారక్‌ ఎలె శ్యాంకుమార్‌ అన్నారు. మడికొండ నెహ్రూనగర్‌లోని విద్యారణ్య ఆవాసం వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. సేవాభారతి జిల్లా కార్యదర్శి హన్మరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాభారతి విద్యార్థులు ప్రదర్శించిన గోష్‌, కర్ర సాము, యోగాసనాలు, దేశభక్తి గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. 
అనంతరం కార్యక్రమానికి ప్రధాన వక్తగా హజరైన శ్యాంకుమార్‌ మాట్లాడుతూ అపార సంపదకు నిలయమైన భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ వేగంగా ముందుకెళ్తుందని అన్నారు. దేశంలో 60 శాతం యువత ఉండడం దేశ అభివృద్ధికి చిహ్నమన్నారు. యువతకు కేవలం సంపాదించడం మాత్రమే నేర్పడమే కాకుండా వాటితోపాటు విలువలు, సంస్కారం నేర్పించడానికే సేవాభారతి కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. ఒక వైపు సోదరభావం అంటూనే జిహాద్‌ పేరుతో కల్లోలం, మరోవైపు మాత మార్పిడిలతో మారణహోమం సృష్టిస్తున్న ఘటనలను నిత్యం చూస్తున్నామన్నారు.

స్వామి వివేకానంద చెప్పినట్లు అద్భుతమైన భారతావని నిర్మాణానికి వ్యక్తి మానసిక నిర్మాణం ఎంతో అవసరమన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి ప్రతిభాపేక్ష లేకుండా సమాజం కోసం కష్టపడేవారే నిజమైన హిందువులని పేర్కొన్నారు. సేవాభారతి కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మందికి విలువలు, సంస్కారాన్ని నేర్పుతున్నామన్నారు.

విశ్రాంత ఇంజనీరు వెదిరే వెంకట్‌రెడ్డి, నిట్‌ డైరెక్టర్‌ జీఆర్‌సీరెడ్డి, స్వామి, వీరారెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, సుద్దాల వెంకటనారాయణ, జక్కె శంకరయ్య, డాక్టర్‌ రమ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌, సేవా భారతి నిర్వాహకులు అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Sri Vidhyaranya Awasam, A college students home for the needy, Warangal celebrates it's 4th anniversary sevabharathi

Sri Vidhyaranya Awasam, A college students home for the needy, Warangal celebrates it's 4th anniversary sevabharathi

Tuesday, August 30, 2016

Monday, August 22, 2016

Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Celebrating Silver Jubilee the Alumni of Sevabharathi Affection Homes. The family has grown to over 2,000 out of which 1389 are Alumni.

 Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Sevabharathi AP runs 7 Affection Homes in 4 districts catering to the most needy and destitute children

  1. Mathruchaya Chatravas(32 Children) Nutakki, Krishna Dist
  2. Bhakta Kannappa Gurukulam, (36 Tribal children) Gokavaram, Kurnool Dist
  3. Sanghamitra awasam, (35 Orphan Children) Nandyala, Kurnool Dist
  4. Annapoornamma vidyarthi vasathi griham, Kurnool, Kurnool Dist
  5. Nandyala Hanumantareddy Lakshmamma Vidyarthi Vasathi Griham,  Deepaguntla, Kurnool Dist
  6. P A Reddy Hostel(39 Children) Anantapuram
  7. Sri krishnadevaraya awasam, Dhramavaram, Anantapuram Dist 
  8.  Annapoornamma Vidyardhi uchita vasati Griham, Proddutur, Kadapa Dist 

Sevabharathi Telangana runs 18 Affection Homes

Monday, June 27, 2016

సేవాభారతి.. సేవే పరమావధి :: నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ

సేవాభారతి.. సేవే పరమావధి 
నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ 
మడికొండ, న్యూస్‌టుడే 
ఉన్నత చదువులు లేని యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు రాక.. ఉపాధి అవకాశాలు లేక నిరుత్సాహానికి గురవుతుంటారు. అటువంటి వారికి బాసటగా నిలుస్తోంది మడికొండలోని సేవాభారతి సంస్థ. వేలకు వేలు వెచ్చించినా లభించని వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ నిరుద్యోగ యువతకు చేయూతనిస్తోంది ఈ సంస్థ. యువతకు, మధ్య తరగతి మహిళలకు.. కుట్టుపని, బ్యూటీషియన్‌, ఫ్రిజ్‌, ఏసీ, కూలర్ల మెకానిజం తదితర ఉపాధి అంశాల్లో తర్ఫీదునిస్తూ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. స్వయంఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేలా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహమందిస్తోంది. మడికొండలోని వేదవ్యాస పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సేవాభారతి రెండు రకాల సేవా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహిస్తోంది. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు చదవలేని విద్యార్థులను కళాశాలల్లో చేర్పించి చదివిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వివిధ ఉపాధి కోర్సుల్లో నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు భావ వ్యక్తీకరణ, ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థినులకు బ్యూటీషియన్‌, మహిళలకు టైలరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. యువతకు సెల్‌ఫోన్‌, ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో ప్రముఖ కంపెనీలకు చెందిన నిపుణులతో శిక్షణ ఇస్తోంది. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వదిలేయకుండా వారికి వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు సేవా భారతి వారధిగా నిలుస్తోంది. ఈ సంస్థలో ఇప్పటి వరకు శిక్షణ పొందిన వారి అభిప్రాయాలివీ.. 

ఉపాధిపై దిగులు పోయింది
సాయికిరణ్‌, ఏసీ, కూలర్‌, ప్రిజ్‌ మెకానిక్‌
నేను ఐటీఐ చదివాను. మడికొండలోని సేవాభారతిలో ఏసీ, కూలర్లు, ప్రిజ్‌లకు మరమ్మతులు చేయడంలో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. గోద్రేజ్‌ కంపెనీ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నా ముగ్గురు స్నేహితులతో కలిసి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా. నాతో పాటు శిక్షణ పొందిన పదిహేను మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి లభించింది. నేను తరచూ ఈ శిక్షణ కేంద్రానికి వచ్చి మెలకువలు నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను. ప్రస్తుతం నాకు, నా స్నేహితులకు ఉపాధిపై దిగులు పోయింది.

ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నాను
వై.వర్షిత, ఇంటర్‌ విద్యార్థిని
నేను వేసవి సెలవుల్లో మడికొండ వేదవ్యాస పాఠశాల ఆవరణలోని సేవాభారతిలో ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీస్‌ తరగతులకు వెళ్లాను. ప్రస్తుతం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలను ఆంగ్లంలోనే నిర్వహిస్తున్నారు. అంతే కాక నేటి ఆధునిక ప్రపంచంలో ఆంగ్లం తప్పనిసరిగా రావాలనే పట్టుదలతో నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలోనే నేను బిడియం లేకుండా ఆంగ్లంలో మాట్లాడాను. ఇక మీదట సేవాభారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరై వివిధ ఉపాధి కోర్సులను నేర్చుకుంటాను. బాలికలు, మహిళలు అనుసరించాల్సిన వస్త్రధారణ, సంస్కారం వంటి అంశాలను బాగా వివరించారు.

కుట్టుపై పట్టు వచ్చింది
శ్రీవిద్య, టైలరింగ్‌ నేర్చుకున్న మహిళ
మా పిల్లలను పాఠశాలకు పంపించిన తర్వాత ఏం చేయాలో తోచేది కాదు. మడికొండ వేద వ్యాస పాఠశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. శిక్షణలో చేరి కుట్టు పనులు నేర్చుకున్నాను. పది రోజుల వ్యవధిలో కొన్ని మాత్రమే నేర్చుకున్నానన్న నిరాశ నాలో ఉంది. మరో పదిరోజులు నేర్పిస్తే పిల్లల దుస్తులు కూడా కుట్టడం నేర్చుకునే అవకాశం ఉండేది. మొత్తానికి మిషన్‌పై కూర్చోవడం కూడా తెలియని నాకు కుట్టులో పట్టు వచ్చింది.


అందంపై మక్కువతో నేర్చుకున్నా
- శృతి, డిగ్రీ విద్యార్థిని
నేను అందంపై మక్కువతో సేవా భారతిలో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకున్నాను. ఫేషియల్‌, హెన్నా, పెడిక్యూర్‌ వంటి అంశాలను శిక్షణలో నేర్పించారు. ఇంట్లో లభించే పదార్థాలతో మేకప్‌ ఎలా వేసుకోవాలి. అందంగా ఎలా తయారు కావాలి అనే విషయాలను నేను బాగా నేర్చుకున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్లకు ఫేషియల్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నాను. స్పోకెన్‌ ఇంగ్లీషులో కూడా శిక్షణ తీసుకున్నాను. ఒకసారి బ్యుటీషియన్‌, ఆంగ్లం నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సేవాభారతిలో అందించే కోర్సులను అందరూ ఉపయోగించుకోవాలి. ఎవరో ఉద్యోగం ఇస్తారని ఎదురు చూడకుండా మనమే

టెక్నిషియన్‌గా ఎదగాలి. .
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సేవలు
-సత్యం, సేవాభారతి నిర్వాహకుడు
సేవాభారతి రాష్ట్ర వ్యాప్తంగా 15 శాఖలను ఏర్పాటు చేసి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ, బాల సంస్కార కేంద్రాలు, ట్యూషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మడికొండలో ఏర్పాటు చేసిన సేవాభారతిలో మొదటి బ్యాచ్‌ ద్వారా 20 మందికి ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌ల మరమ్మతుల్లో శిక్షణ ఇచ్చాం. కొందరికి ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి లభించింది. ఇంకా మహిళలు, విద్యార్థుల కోసం తక్కువ వ్యవధిలో కొన్ని కోర్సులను రూపొందించి నేర్పిస్తున్నాం. యువత నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నాం.


Source: http://archives1.eenadu.net/06-18-2016/district/inner.aspx?dsname=Warangal&info=wgl-sty4